Training to Fisheries Department Staff on Aqua Culture At Manginapudi. Tyagaraju. Cell:9032608505, Prawn Seed
మత్స్యశాఖ సిబ్బందికి క్షేత్రస్థాయిలో శాఖాపరమైన శిక్షణా సమయం నందు వనామి రొయ్యల సాగు విధానంపై అవగాహన కార్యక్రమం
గిలకలదిండి గ్రామం పరిధిలోగల వనామి రొయ్యల సాగు చేయు రైతు మేడెంపూడి సతీష్ గారి చెరువుల వద్ద కృష్ణాజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు శ్రీ షేక్ లాల్ మొహమ్మద్ గారి ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా మత్స్య శాఖ సిబ్బంది అయినటువంటి ఆరుగురు మత్స్యశాఖ అభివృద్ధి అధికారులకు శాఖా పరమైన శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో రొయ్యల సాగు చేసే రైతుతో కలిసి సాగు చేయు విధానం, సాగులో మెలకువలు తదితర విషయాలను తెలుసుకొని వాటిపై రైతుతో కూలంకషంగా చర్చించి సూచనలు సలహాలు ఇవ్వడం, రైతు వద్ద నుండి సాగులో కలుగు ఇబ్బందులు ఒడిదుడుకులను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు శ్రీ షేక్ లాల్ మొహమ్మద్ గారు శిక్షణలో ఉన్న ఆరుగురు మత్స్యశాఖ అభివృద్ధి అధికారులకు విలువైన సలహాలు సూచనలు చేస్తూ రైతులకు కూడా చెరువు యొక్క రిజిస్ట్రేషన్ ఆవశ్యకత మరియు మత్స్యశాఖ తరపున ఆక్వా చెరువులకు అందజేయు వివిధ పథకాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శిక్షణ లో ఉన్న ఆరుగురు మత్స్యశాఖ అభివృద్ధి అధికారులైన 1. ప్రతిభ, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, మచిలీపట్నం 2. ఈశ్వర్ చంద్ర విద్యా సాగర్,మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, ఆక్వా ల్యాబ్ కైకలూరు 3. మంజూష, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, గుడివాడ 4. శివ నాగాంజనీ, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కృత్తివెన్ను 5. పూజిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కంకిపాడు 6. అఖిల, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, విజయవాడ మరియు గ్రామ మత్స్య సహాయకులు పాల్గొన్నారు. 9032608505, Prawn Seed

9032608505, Prawn Seed