ష్రింప్ హేచరీలు వాడే నాసిరకం, పాడయిన దేశవాళీ బ్లడ్ వార్మ్సు వలన ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్లకు ఈ.హెచ్.పీ(EHP) విబ్రో (VIBRO), వైట్ స్పాట్ (White Spot) సమస్య. 9032608505 Prawn seed
నేడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చ ర్రైతులు గత కొంతకాలంగా నష్టాలను చవి చూస్తున్నారు, ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మొత్తంగా వైరస్విపరీతంగా విస్తరించి, తిష్టవేసింది. అదే సమయంలో ష్రింప్హేచరీలు కూడా దేశవాళీ బ్లడ్వార్మ్సు నాసిరకంవి, పాడయినవి తెచ్చుకొని హేచరీలోవాడుతున్నారు. కావున ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్లకు ఈ.హెచ్.పీ (EHP) విబ్రో (VIBRO), వైట్స్పాట్ (White Spot) సమస్యలు విపరీతంగా రావడంతో ఆక్వారైతులు విపరీతంగా నష్టములను ఎదుర్కొంటున్నారు. ఆక్వారైతులకు చెరువులో రొయ్య పిల్లలు వేసిన 2 వారములు దాటిన తరువాత విబ్రో, 25రోజులతరువాత ఈహెచ్పీగానీ బయటపడకపోవడం వలన చాలా నష్టములను ఎదుర్కొంటున్నారు. సీడ్వేసే ముందు లేబ్టెస్ట్లో కూడా ఇది దొరకడం లేదు. హేచరీలు మాత్రము అదే నాసిరకం దేశవాళీ బ్లడ్వార్మ్సు వాడుతున్నారు. కావున ఈ నష్టాలు అరికట్టలేము. చాలా తక్కువ హేచరీలు నెదర్లాండ్స్నుండి రప్పించిన బ్లడ్వార్మ్సు వాడుతున్నారు. అప్పుడు సమస్యలుతక్కువ. తల్లి రొయ్యలను విదేశాలనుండి తెచ్చినట్లే నాణ్యమైన బ్లడ్వార్మ్సు కూడా హేచరీలు విదేశాల నుండి రప్పించి వాడిన ఆక్వారైతులకు నష్టము, సమస్యలు రాకపోవచ్చు. కానీ ఆ విధంగా అడుగుపడటం లేదు. హేచరీలు నాణ్యమైన సీడ్ ఆక్వారైతులకు అందించీ వారిని ఆదుకోవాలి. కానీ అది జరగడంలేదు. దీనికి పరిష్కారం ఎప్పుడో? 9032608505, Prawn Seed